కేటీఆర్‌పై సృజన్‌రెడ్డి క్రిమినల్ పిటిషన్
ABN , Publish Date - Nov 24 , 2024 | 03:53 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. తన పరువుకు నష్టం కలిగిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది, వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. శోధ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు తాను ప్రమోటర్ లేదా డైరెక్టర్ కాదని తెలిసినప్పటికీ కేటీఆర్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తూ అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని తెలిపారు. ఈ వ్యవహారంలో తాము లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ అసత్య ఆరోపణలు కొనసాగిస్తుండటంతో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.