Share News

CV Anand: గణేశ్‌ బందోబస్తు.. అసలైన ఫైనల్స్‌

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:27 AM

హైదరాబాద్‌ సిటీ పరిధిలో పండుగలు, ఈవెంట్లలో నిర్వహించే బందోబస్తు క్వార్టర్‌, సెమీఫైనల్స్‌ లాంటివి అయితే.. గణేష్‌ బందోబస్తు ఫైనల్స్‌ వంటిదని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Hyderabad City Police Commissioner CV Anand) అన్నారు.

CV Anand: గణేశ్‌ బందోబస్తు.. అసలైన ఫైనల్స్‌

- నేర నియంత్రణ, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం

- డ్రగ్స్‌ నియంత్రణకు హెచ్‌ న్యూ బలోపేతం

- ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు

- రెండోసారి సిటీ పోలీస్‌ కమిషనర్‌గాబాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ సిటీ పరిధిలో పండుగలు, ఈవెంట్లలో నిర్వహించే బందోబస్తు క్వార్టర్‌, సెమీఫైనల్స్‌ లాంటివి అయితే.. గణేష్‌ బందోబస్తు ఫైనల్స్‌ వంటిదని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Hyderabad City Police Commissioner CV Anand) అన్నారు. నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో, గణేష్‌ నిమజ్జనం, శోభాయాత్రలు జరుపుకునేలా చేయగలిగితే పోలీసులు సక్సెస్‌ అయినట్లే అన్నారు. రెండోసారి సిటీ సీపీగా నియమితులైన ఆయన సోమవారం బంజారాహిల్స్‌(Banjara Hills)లోని కమాండ్‌కంట్రోల్‌ సెంటర్‌లో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. ప్రస్తుతం పోలీసుల ముందున్న ప్రధాన చాలెంజ్‌ గణేష్‌ నవరాత్రులు, మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలని అన్నారు.

ఇదికూడా చదవండి: Godavari: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం


శాంతిభద్రతలకు ప్రాధాన్యం..

పోలీస్‏స్టేషన్లలో బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల ఫ్రెండ్లీగా ఉంటూనే రౌడీలు, కేడీలు, క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిపై నార్కోటిక్‌ విభాగం ఉక్కుపాదం తడాఖా చూపుతోందని, వారితో పాటు.. సిటీ కమిషనరేట్‌ పరిధిలోని హెచ్‌ న్యూ (హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌)ను బలోపేతం చేసి డ్రగ్స్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెడతామన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, సాధ్యమైనంత వరకు బెటర్‌ ట్రాఫిక్‌ను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.

ఇదికూడా చదవండి: TG News: మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం


గతేడాది హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పునర్వవస్థీకరణలో భాగంగా చేపట్టిన ఫిట్‌ కాప్‌, డి కాంబో, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, సీసీఎస్‌ బలోపేతం, మహిళా ఇన్‌స్పెక్టర్లకు ఎస్‌హెచ్‌వోలుగా అవకాశం కల్పించడం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ.. సమర్థవంతమైన పోలీసింగ్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీ వెంట అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌, అడిషనల్‌ సీపీ (ట్రాఫిక్‌) విశ్వప్రసాద్‌, ఐసీసీసీ డీఐజీ పరిమళా హననూతన్‌, అడ్మిన్‌ జాయింట్‌ సీపీ గజరావ్‌ భూపాల్‌, ఇతర అధికారులు ఉన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 10 , 2024 | 08:27 AM