Cyberabad: సైబరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌ల బదిలీలు..
ABN , Publish Date - Jul 21 , 2024 | 12:11 PM
సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి(CP Avinash Mahanty) ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసులును సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు, సెంట్రలైజ్‌డ్ కాల్‌డాటా అనాలసిస్‌లో పనిచేస్తున్న పి.సతీష్‌ను దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు, దుండిగల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శంకరయ్యను సైబర్‌క్రైం పోలీస్ స్టేషన్‌కు, సైబరాబాద్ వీఆర్‌లో పనిచేస్తున్న కె.ప్రదీప్ లింగంను ఉమన్ సేఫ్టీ వింగ్‌కు, ఉమన్ సేఫ్టీవింగ్‌లో పనిచేస్తున్న ముత్తుయాదవ్‌ను కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు, రాజేంద్రనగర్ డీఐ చంద్ర గంగాధర్‌ను బాలానగర్ సీసీఎస్‌కు బదిలీ చేశారు.
ఇదికూడా చదవండి: జేఎన్‌టీయూ షాన్‌దార్.. ఇంజినీరింగ్ విద్యలో వర్సిటీ మేటి
అలాగే... సీసీఎస్ బాలానగర్‌లో పనిచేస్తున్న సీహెచ్ రాజును సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు, సైబరాబాద్ వీఆర్‌లో పనిచేస్తున్న పి.రాజే ను క్యాట్‌కు, సైబరాబాద్ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్.విజయ్‌ను రాయదుర్గం డీఐగా, సైబరాబాద్ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్.కనకయ్యను జీడిమెట్ల డీఐగా, మైలార్‌దేవ్‌పల్లి డీఐగా పనిచేస్తున్న గొల్ల తిమ్మన్నను బాచుపల్లి డీఐగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కటకం శ్రీనివాస్‌ను మైలార్‌దేవ్‌పల్లి డీఐగా బదిలీ చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News