Share News

Loan App Scams: లోన్‌యా్‌పల పేరిట మోసం.. 8 మంది అరెస్టు

ABN , Publish Date - Aug 30 , 2024 | 04:23 AM

లోన్‌యా్‌పల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

Loan App Scams: లోన్‌యా్‌పల పేరిట మోసం.. 8 మంది అరెస్టు

హైదరాబాద్‌/ కరీంనగర్‌ క్రైం/ కాల్వ శ్రీరాంపూర్‌/ఓదెల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): లోన్‌యా్‌పల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను సైబర్‌ సెక్యూరిటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన వ్యక్తి రూ.లక్ష పీఎం విశ్వకర్మ కమ్యూనిటీ వర్క్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంజూరుకు కొంత నగదు కట్టాలంటూ అదే రోజు అతడి ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. అది నమ్మిన అతడు మొత్తం రూ. 12,250 చెల్లించాడు.


ఆ తరువాత మళ్లీ రూ.9 వేలు చెల్లించాలని సందేశం రావడంతో మోసపోయానని గ్రహించి 1930 నంబర్‌లో ఫిర్యాదు చేశాడు. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, కొత్తకోట పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి వనపర్తి జిల్లా పెద్దమండది మండలం బలిపల్లి ఎర్రగుట్ట తండాకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 55 ఎఫ్‌ఐఆర్‌లు, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో 373 ఫిర్యాదులు ఉన్నట్లు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ శిఖా గోయల్‌ వెల్లడించారు.


మరోవైపు తీసుకున్న డబ్బులు చెల్లించాలని లోన్‌యా్‌ప నిర్వాహకులు వేధించడంతో కరీంనగర్‌కు చెందిన సతీ్‌షరెడ్డి (43) ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర్‌కు చెందిన తుండ్ల శ్రీనివాస్‌ (27) ఫైనాన్స్‌, క్రెడిట్‌ కార్డ్‌ అనే రెండు లోన్‌యాప్‌ల ద్వారా సుమారు 4,80,000 వరకు రుణం తీసుకున్నాడు. డబ్బులు కట్టాలని వారు వేధిస్తుండడంతో మనోవేదనకు గురై బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Aug 30 , 2024 | 04:23 AM