Damodara Rajanarasimha: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

ABN , First Publish Date - 2024-02-06T15:55:40+05:30 IST

ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

Damodara Rajanarasimha: ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం వింటోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వపక్షాన సీనియర్ న్యాయవాది వివేక్‌ను నియమించామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

వివేక్ పాజిటివ్ వాదనలు వినిపిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రికి దళిత జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, ఆదివాసీలు అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరించిందన్నారు. గద్దర్, అందెశ్రీ లాంటి గాయకులను బీఆర్ఎస్ విస్మరించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టుపై సంపూర్ణమైన విశ్వసం ఉందన్నారు. ఎవరికి వ్యతిరేకంగా వర్గీకరణ చెయ్యాలని అడగడం లేదన్నారు. ఎవరి వాటా వారికి దక్కలనే దీని ఉద్దేశ్యమని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Updated Date - 2024-02-06T15:55:42+05:30 IST