Share News

Hyderabad: ‘బడి బాట’ బాధ్యత జిల్లా కలెక్టర్లదే

ABN , Publish Date - May 30 , 2024 | 06:03 AM

రాష్ట్రంలో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని, జిల్లా స్థాయిలో వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్‌ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Hyderabad: ‘బడి బాట’  బాధ్యత జిల్లా కలెక్టర్లదే

  • జూన్‌ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం

  • మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని, జిల్లా స్థాయిలో వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్‌ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు బుధవారం విడుదల చేశారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో టీచర్లు, అధికారులు బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది.అలాగే పిల్లల తల్లిదండ్రుల్లో చదువు పట్ల అవగాహన కల్పించాలి. గురువారంలోపు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయా విభాగాల అధికారులతో సమీక్షించాల్సి ఉంటుంది. బడి బాట కార్యక్రమం కోసం జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి.

Updated Date - May 30 , 2024 | 06:03 AM