Dodla Dairy: కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలకు దొడ్ల డెయిరీ రూ.4 కోట్ల విరాళం
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:45 AM
పీవీ నర్సింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిఽధిలోని కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి దొడ్ల డెయిరీ రూ. 4 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
రాజేంద్రనగర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పీవీ నర్సింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిఽధిలోని కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి దొడ్ల డెయిరీ రూ. 4 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన దొడ్ల డెయిరీ బోర్డు ఆమోద పత్రాన్ని సంస్థ సీఈవో బీవీకే రెడ్డి విశ్వవిద్యాలయం ఉపకులపతి, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు సోమవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో అందజేశారు.