ERC: ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Oct 31 , 2024 | 03:44 AM
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్‌గా డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) చైర్మన్‌గా డాక్టర్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈఆర్‌సీ కార్యాలయంలో ఆయన చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రమాణస్వీకారం చేయించారు. ఆ బాధ్యతను అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఓత్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కట్టబెడుతూ మంగళవారం సాయంత్రం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
ఈఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ దేవరాజు నాగార్జున్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నిస్తానని చెప్పారు.