Share News

Sridhar Babu: యూనికార్న్‌లుగా స్టార్ట్‌పలు ఎదగాలి

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:07 AM

స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువ ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతతో యూనికార్న్‌లుగా (బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీ) ఎదగాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Sridhar Babu: యూనికార్న్‌లుగా స్టార్ట్‌పలు ఎదగాలి

  • ఆవిష్కర్తలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు

  • ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువ ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతతో యూనికార్న్‌లుగా (బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీ) ఎదగాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో ఏర్పాటుచేసిన మూడు రోజుల ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫెస్టివల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడి స్టార్ట్‌పలు యూనీకార్న్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏఐ సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు అనేక అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, స్టార్ట్‌పలకూ అద్భుత అవకాశాలు ఉంటాయన్నారు.


సైంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐ రంగంలో ఎదిగేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయని తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ ఎండీ సంగీతారెడ్డి మాట్లాడుతూ నేటికీ ప్రపంచవ్యాప్తంగా 300కోట్ల ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని, ఇలాంటి సమస్యలకు స్టార్ట్‌పలు పరిష్కారం చూపాలన్నారు. స్టార్ట్‌పలుగా ఎదిగేందుకు యువ ఆవిష్కర్తలకు ప్రస్తుతం అద్భుతమైన అవకాశాలున్నాయని పారిశ్రామికవేత్త శ్రీనిరాజు అన్నారు. శనివారం వరకు కొనసాగనున్న స్టార్టప్‌ ఫెస్టివల్‌లో 15దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారని ఇంటర్నేషనల్‌ స్టార్టప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు జేఏ చౌదరి తెలిపారు.

Updated Date - Sep 27 , 2024 | 03:07 AM