Share News

Flood Relief: బుడమేరులో రంగంలోకి సైన్యం

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:23 AM

వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి.

Flood Relief: బుడమేరులో రంగంలోకి సైన్యం

  • 120 మంది మద్రాస్‌ బెటాలియన్‌ జవాన్ల రాక

  • యుద్ధ ప్రాతిపదికన మూడో గండి పూడ్చే పనులు

  • నేటి ఉదయానికి పూర్తయ్యే అవకాశం

జి.కొండూరు, సెప్టెంబరు 6: వరద కారణంగా బుడమేరు వరద మళ్లింపు కాలువ (బీడీసీ) ఎడమ కట్టకు పడిన గండ్ల పూడిక పనులు యుద్ధ ప్రాతిపధికన కొనసాగుతున్నాయి. మొత్తం 3 ప్రధాన గండ్లలో ఇప్పటికే 2 గండ్లు పూడ్చగా అతి పెద్దదైన మూడో గండి పూడ్చివేత శనివారం ఉదయానికి పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ పల్లపు ప్రాంతాలను అతలాకుతలం చేసిన బుడమేరు వరద నుంచి బాధితులను కాపాడేందుకు, సహాయ చర్యలు ముమ్మరంగా చేసేందుకు బుడమేరు వరద గండ్ల ద్వారా విజయవాడ వైపు రాకుండా చేయాల్సి ఉంది.


దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి సైన్యాన్ని రంగంలోకి దించారు. మద్రాసు 6వ బెటాలియన్‌ నుంచి 120 మంది జవాన్లు వచ్చారు. వారు తాత్కాలికంగా రాడ్డులతో వంతెన నిర్మాణం చేసి.. అందులో రాళ్లు వేసి గండి పూడ్చేందుకు యత్నిస్తున్నారు. వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 4వ కిమీ వద్ద 60 మీటర్లు, 4.1 కిమీ వద్ద 50 మీటర్ల మేర పడిన గండ్లలో 4.1, 4 కిమీ వద్ద ఏర్పడిన గండ్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూడ్చివేశారు. 3.9వ కిమీ వద్ద పడిన 100 మీటర్ల గండిని సాయంత్రానికి 20 శాతం పూర్తి చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 03:23 AM