Share News

Minister Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఎలివేటర్ కారిడార్‌కి మోక్షం

ABN , Publish Date - Mar 07 , 2024 | 06:48 PM

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడ్డ 100 రోజుల్లోనే రాజీవ్ రహదారి ఎలివేటేడ్ ఎలివేటర్ కారిడార్‌కి మోక్షం లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. గురువారం నాడు మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ...ఆల్వాల్ ప్రాంతం నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలకు లక్షలాది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కారిడార్‌కి ఈరోజు(గురువారం) శంకుస్థాపన చేశారని అన్నారు.

Minister Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ఎలివేటర్ కారిడార్‌కి మోక్షం
Ponnam Prabhakar

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడ్డ 100 రోజుల్లోనే రాజీవ్ రహదారి ఎలివేటేడ్ ఎలివేటర్ కారిడార్‌కి మోక్షం లభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. గురువారం నాడు మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ...ఆల్వాల్ ప్రాంతం నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలకు లక్షలాది ప్రజలకు సౌకర్యవంతంగా ఉండటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కారిడార్‌కి ఈరోజు(గురువారం) శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు వారి గమ్యస్థానం నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తయితే.. ఇక్కడి నుంచి సిటీలోకి వెళ్లడానికి అంతే సమయం పట్టే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈ రోడ్డు గత 30 - 40 సంవత్సరాలుగా మిలట్రీ కంటోన్మెంట్‌, ప్రభుత్వానికి మధ్య ఈ రోడ్డు నలుగుతున్నదని చెప్పారు.

మిలటరీ ల్యాండ్స్‌ను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ చేశారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందని భావించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కారిడార్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది పూర్తయితే సమయాన్ని పూర్తిగా తగ్గించవచ్చని అన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ఎలివేటర్ కారిడార్‌కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అందుకు సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్ అండ్‌బీ, జీహెచ్ఎంసీ ఇతర అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

KTR: రేవంత్ ప్రభుత్వాన్ని మేము కూల్చం.. కేటీఆర్ హాట్ కామెంట్స్

CM Revanth: మేము అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించాం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 06:48 PM