Errabelli Dayakar Rao: ఊహాగానాలకు చెక్.. మళ్లీ మార్చేస్తామంటూ ఎర్రబెల్లి సంచలనం..
ABN , Publish Date - Apr 06 , 2024 | 01:48 PM
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఎండిన పంటలకు మద్దతుగా రైతుల మహా ధర్నాలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అవేంటంటే.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని ప్రకటించారు.
జనగామ : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో ఎండిన పంటలకు మద్దతుగా రైతుల మహా ధర్నాలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అవేంటంటే.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మారుస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌పైనే పోటీ చేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి (BRS) పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా మారుతుందా? ఈ దిశగా బీఆర్‌ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోందంటూ కొంత కాలంగా ఊహాగానాలు వినవస్తున్నాయి. ఎర్రబెల్లి వ్యాఖ్యలతో అది నిజమేనని తేలింది.
గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం.. ఆ నియోజకవర్గాలకు..
బీఆర్‌ఎ్‌సగా పేరు మార్చాక తెలంగాణలో అధికారం కోల్పోవడం, రాష్ట్రంలో రోజురోజుకూ పార్టీ గ్రాఫ్ తగ్గుతున్న నేపథ్యంలో పేరు మార్పుపై అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్‌ఎ్‌సను.. బీఆర్‌ఎ్‌సగా మార్చాలని ఎవరు చెప్పారు? తెలంగాణ ఆత్మగా చెప్పుకొనే పార్టీ పేరును ఎవరినీ అడగకుండా ఎలా మార్చారు? పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే’’ అంటూ ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాల్లో కింది స్థాయి కార్యకర్తల నుంచి ఓ మోస్తరు నాయకుల వరకు అధిష్ఠానాన్ని నిలదీస్తూ వస్తున్నారు. దీంతో జనానికి పార్టీ దూరం కావడానికి ఇదే ప్రధాన కారణమని భావించిన అధిష్ఠానం.. పేరు మార్పే శరణ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..
తెలంగాణలో ప్రత్యేక గుర్తింపును, అధికారాన్ని తెచ్చిపెట్టిన టీఆర్‌ఎస్ పేరునే జనంలోకి తీసుకువెళ్లేలా.. బీఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎ్‌సగా మార్చేందుకు అనువైన అంశాలపై ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతర్గతంగా జరుగుతున్న ఈ ప్రయత్నం వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎ్‌సగా మార్పు చేయడమా? లేదంటే.. ఇతర రాష్ట్రాల్లో కొనసాగించేలా జాతీయ రాజకీయాల కోసం బీఆర్‌ఎ్‌సను, తెలంగాణలో మాత్రమే కొనసాగించేందుకు టీఆర్‌ఎస్ పేరును మళ్లీ పొంది.. రెండు పార్టీలను నిర్వహించాలా? అన్నదానిపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు, చట్టపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్న దానిపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే బీఆర్‌ఎ్‌సను టీఆర్‌ఎ్‌సగా మార్చడం వల్ల తెలంగాణలో తిరిగి తమ మార్క్ సెంటిమెంట్ రాబట్టగలుగుతామని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Congress: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం