Watch Video: స్పృహ తప్పి పడిపోయిన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
ABN , Publish Date - Jan 26 , 2024 | 01:17 PM
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో జెండావిష్కరణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. రిపబ్లిక్ డే (Republic Day) వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో జెండావిష్కరణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే ఇతర నేతలు ఆయనను పైకి లేపారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహమూద్ అలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.