Share News

Food Safety: శుచి లేదు.. శుభ్రత అంత కన్నా లేదు

ABN , Publish Date - May 24 , 2024 | 02:55 PM

రామేశ్వరం కేఫ్‌లో పాచిపోయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన 10 కిలోల నందిని పెరుగు గుర్తించారు. 8 లీటర్ల పాల ఎక్స్‌పైరీ డేట్ కూడా ముగిసింది. కిచెన్‌లో సింథటిక్ ఫుడ్ కలర్ కనిపించింది. కూరలు టేస్ట్ వచ్చేందుకు వాడుతుంటారు. మోతాదుకు మించి వాడొద్దని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తుంటారు.

Food Safety: శుచి లేదు.. శుభ్రత అంత కన్నా లేదు
rameshwaram cafe

హైదరాబాద్: పేరుకేమో పెద్ద పెద్ద హోటళ్లు.. నాణ్యతా ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. కొన్ని హోటళ్ల తీరు ఇలా ఉంది. హైదరాబాద్‌లో పలు హోటళ్లలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాదాపూర్‌లో గల రామేశ్వరం కేఫ్‌లో (Rameshwaram Cafe) తనిఖీ చేశారు. రామేశ్వరం కేఫ్ అంటే ఫేమస్ హోటల్. అందులో తనిఖీ చేయగా ఏ మాత్రం శుచి, శుభ్రత కనిపించడం లేదు. పైగా గడువు ముగిసిన పాలు, పెరుగు చూసి అధికారులే ఆశ్చర్య పోయారు.


రామేశ్వరం కేఫ్

రామేశ్వరం కేఫ్‌లో పాచిపోయిన ఆహార పదార్థాలను ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన 10 కిలోల నందిని పెరుగు గుర్తించారు. 8 లీటర్ల పాల ఎక్స్‌పైరీ డేట్ కూడా ముగిసింది. కిచెన్‌లో సింథటిక్ ఫుడ్ కలర్ కనిపించింది. కూరలు టేస్ట్ వచ్చేందుకు వాడుతుంటారు. మోతాదుకు మించి వాడొద్దని వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తుంటారు. రామేశ్వరం కేఫ్‌‌లో కిచెన్ అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసిన బొద్దింకలు కనిపించాయి. రామేశ్వరం కేఫ్‌కు ఉన్న పేరును చూసి ఫుడ్ కోసం వినియోగదారులు వస్తుంటారు. అక్కడ ఏ మాత్రం శుచి, శుభ్రత లేదు.


మిగిలిన చోట్ల కూడా

రామేశ్వరం కేఫ్ అని కాదు మిగిలిన కొన్ని హోటళ్లు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. ఫుడ్ సేప్టీ అధికారులు పర్యటించిన సమయంలో ఆ విషయం బయట పడింది. నోటీసులు ఇస్తే.. వద్దు, ఇక నుంచి అలా చేయం అని అధికారులను బతిమి లాడుతున్నారు. తీరా చూస్తే ఎప్పటిలాగానే వ్యవహరిస్తున్నారు. హోటల్ వచ్చి తినే కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. శుచి, శుభ్రత పాటించని హోటళ్లు, ఎక్స్ పైరీ డేట్ పూర్తయిన పదార్థాలు వాడిన హోటళ్లను శాశ్వతంగా సీజ్ చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.



For More Telangana News and Telugu News..

Updated Date - May 24 , 2024 | 02:55 PM