Share News

LokSabha Elections: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి

ABN , Publish Date - May 01 , 2024 | 08:26 PM

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షీ.. ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ కుండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.

LokSabha Elections: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్, మే 1: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్ మున్షీ.. ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ కుండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు.

Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య

గతేడాది నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కారు పార్టీలోని పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ


అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కె. జానారెడ్డితో ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై ఊహగానాలు ఊపందుకొన్నాయి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో సైతం ఆయన సమావేశమయ్యారు. దాంతో ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మార్పు అనివార్యమంటూ ఓ చర్చ సైతం నడిచింది.

Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు

అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంద్రకరణ్‌రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆగిపోయారు. అయితే తొలుత తన కేడర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి పంపి.. అనంతరం ఆయన పార్టీ మారేందుకు ఇంద్రకరణ్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం.

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు..


ఆ క్రమంలో ఆయన బుధవారం కారు పార్టీకి బై బై చెప్పేసి.. హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో.. అంటే 2014లో నిర్మల్ నుంచి బీఎస్‌పీ ఎమ్మెల్యేగా ఇంద్రకరణ్ రెడ్డి గెలుపొందారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఆయన కారు పార్టీలో చేరారు.

TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు

ఆ క్రమంలో కేసీఆర్ కేబినెట్‌లో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్‌ పార్టీకి ఓటర్లు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. దీంతో ఆ పార్టీలో కేసీఆర్ వెంట దశాబ్దాలుగా అడుగులు వేసిన వారు సైతం.. ఒకొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఆ క్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి కారు పార్టీని వీడారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 08:26 PM