ఆర్‌ఆర్‌ఆర్‌కు మేమే 76% భూమి సేకరించాం
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:52 AM
గత ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పేందుకు కూడా కాంగ్రెస్ నేతలకు నోరు రావడంలేదని, ఉత్తర రీజినల్ రింగ్‌రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
అబద్ధాలు చెప్పడంలో సీఎం, మంత్రుల పోటీ: ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పేందుకు కూడా కాంగ్రెస్ నేతలకు నోరు రావడంలేదని, ఉత్తర రీజినల్ రింగ్‌రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడుతున్నారని, 2021లోనే ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు కేంద్రం అనుమతించిందని చెప్పారు. దక్షిణభాగం రీజినల్ రింగ్ రోడ్డును తమ భూముల చూట్టూ అలైన్ మెంట్ మార్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డుకు బీఆర్‌ఎస్ హయాంలోనే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపిందని.. దాన్ని తమ ఘనతగా కాంగ్రె్‌సనేతలు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.
భూసేకర ణకోసం కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ సర్కారు రూ.100కోట్లు డిపాజిట్ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్ వెళ్లే నాలుగు జిల్లాల్లో ప్రత్యేకాధికారులను నియమించి.. 76శాతం భూేసకరణ పూర్తి చేశామని చెప్పారు.. కాగా కాంగ్రెస్ పాలనలో నేరాలు, హత్యోదంతాలు పెరిగాయని., డీజీపీ కొన్నింటిని మాత్రమే వెల్లడించారని బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎ్‌సప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో డబ్బులకోసం హత్యలు 40శాతం, 18ఏళ్లలోపు ఆడపిల్లలపై 82శాతం అత్యాచారాలు పెరిగాయన్నారు.