Share News

Huzur Nagar: పోలీస్‌ కస్టడీకి మాజీ తహసీల్దార్‌ జయశ్రీ

ABN , Publish Date - Oct 11 , 2024 | 04:29 AM

ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మాజీ తహసీల్దార్‌ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్‌ కోర్టు పోలీ్‌సకస్టడీకి అనుమతిచ్చింది.

Huzur Nagar: పోలీస్‌ కస్టడీకి మాజీ తహసీల్దార్‌ జయశ్రీ

హుజూర్‌నగర్‌, అక్టోబరు 10: ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మాజీ తహసీల్దార్‌ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్‌ కోర్టు పోలీ్‌సకస్టడీకి అనుమతిచ్చింది. జయశ్రీ 36.23 ఎకరాల ప్రభుత్వ భూమిని జగదీష్‌ అనే ఽ‘ధరణి’ కంప్యూటర్‌ ఆపరేటర్‌ కుటుంబసభ్యులకు బదలాయించి దాదాపు రూ.14 లక్షల మేర ‘రైతుబంధు’ లబ్ధి పొందిన సంగతి తెలిసిందే. జయశ్రీని 5 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. ఇరువైపు వాదనలు విన్న కోర్టు శుక్రవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే ఆమెను పోలీస్‌ కస్టడీకి అనుమతించారు.


మరోవైపు జయశ్రీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, జయశ్రీ భూ దందా వెలుగు చూసిన నేపథ్యంలో భూబదలాయింపులపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పేరుతో జరిగిన భూదందాలను సీరియ్‌సగా పరిగణిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

Updated Date - Oct 11 , 2024 | 04:29 AM