Home » Huzurnagar
ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మాజీ తహసీల్దార్ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్ కోర్టు పోలీ్‌సకస్టడీకి అనుమతిచ్చింది.
‘ధరణి’ పోర్టల్ ద్వారా అక్రమంగా ప్రభుత్వ భూమిని బదలాయించి రూ.14 లక్షల ‘రైతుబంధు’ లబ్ధి పొందిన తహసీల్దార్‌కు హుజూర్‌నగర్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
భార్య కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించేందుకు సిద్ధపడ్డాడా భర్త! ఏడో నెలలో అబార్షన్ చేస్తే తల్లిప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించినా అతడి మనసు మారలేదు! తెలిసిన ఆర్‌ఎంపీ సాయంతో.. ఓ వైద్యుణ్ని సంప్రదించి.. అతడి మామిడితోటలో దొంగచాటుగా అబార్షన్ చేయించాడు.
ఈ ఫొటోలోని మహిళలు ఉపాధి కూలీలు! వారి మధ్య కూర్చుని ప్లేట్లో అన్నం తింటూ కూలీల్లో కూలీగా కలిసిపోయిన యువకుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి సందీప్ బాగా! సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
అసలే వయసు పైబడింది.. ఆపై కళ్లు సరిగా కనిపించవు.. రాత్రిపూట బయటికొచ్చిన ఓ వృద్ధురాలు ఇంటి ఆవరణలోని బావిలో పడిపోయింది. దాదాపు 2 గంటల పాటు నరకయాతన అనుభవించింది.
రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డుల ద్వారా పేదలందరికీ సన్న బియ్యం అందిస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాలుగు నెలల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే 115 మందితో తొలిజాబితాను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇంకో నాలుగుస్థానాలకు పోటాపోటీగా అభ్యర్థులు ఉండటంతో పెండింగ్‌లో పెట్టేసింది. ఇక కాంగ్రెస్ (Congress) కూడా బీఆర్ఎస్‌కు ధీటుగా..