Share News

Hyderabad: నెహ్రూ.. సోషలిస్టు నాయకుడు

ABN , Publish Date - May 28 , 2024 | 06:31 AM

సోషలిజంలో ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందని భావించిన సోషలిస్టు నాయకుడు జవహర్‌లాల్‌ నెహ్రూ అని సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వీసీ రాజేన్‌ హర్షే అన్నారు. నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా ఇందిరాభవన్‌లో సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో నెహ్రూ-ఇండియన్‌ డెమొక్రసీ అన్న అంశంపై సదస్సు జరిగింది.

Hyderabad: నెహ్రూ.. సోషలిస్టు నాయకుడు

  • సెంట్రల్‌ వర్సిటీ మాజీ వీసీ రాజేన్‌ హర్షే

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): సోషలిజంలో ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందని భావించిన సోషలిస్టు నాయకుడు జవహర్‌లాల్‌ నెహ్రూ అని సెంట్రల్‌ యూనివర్సిటీ మాజీ వీసీ రాజేన్‌ హర్షే అన్నారు. నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా ఇందిరాభవన్‌లో సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో నెహ్రూ-ఇండియన్‌ డెమొక్రసీ అన్న అంశంపై సదస్సు జరిగింది. పార్టీ నేత శ్యామ్‌మోహన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రాజేన్‌ హర్షేతో పాటుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, మహే్‌షకుమార్‌ గౌడ్‌, పార్టీ సీనియర్‌ నేత వి. హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాజేన్‌ హర్షే మాట్లాడుతూ.. నెహ్రూ గొప్ప ఉదారవాద ప్రజాస్వామ్యవాది అని, మానవ హక్కుల కోసం పోరాడిన సంప్రదాయ వాది కూడా అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నెహ్రూనే అన్నారు. మహే్‌షకుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ నెహ్రూ దేశాన్ని దూర దృష్టితో చూశారన్నారు. వి. హన్మంతరావు మాట్లాడుతూ.. పంచవర్ష ప్రణాళికలను నెహ్రూ అమలులోకి తెచ్చారన్నారు. దేశంలో డ్యామ్‌లు కట్టిందీ ఆయనేనన్నారు.


సీఎం రేవంత్‌ నివాళి

దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 60వ వర్ధంతి సందర్భంగా సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2024 | 06:31 AM