Share News

Gandipet Reservoir: మరో రెండు గేట్ల ఎత్తివేత..

ABN , Publish Date - Sep 28 , 2024 | 09:43 AM

ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి(Gandipet Reservoir) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఈ జలాశయం మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 242 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

Gandipet Reservoir: మరో రెండు గేట్ల ఎత్తివేత..

- గండిపేట జలాశయం నాలుగు గేట్ల ద్వారా 484 క్యూసెక్కుల నీటి విడుదల

హైదరాబాద్‌ సిటీ: ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి(Gandipet Reservoir) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఈ జలాశయం మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 242 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం నాలుగు గేట్ల ద్వారా 484 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. అటు హిమాయత్‌ సాగర్‌ జలాశయం ఒక గేటు ద్వారా 348 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా హిమాయత్‌ సాగర్‌కు 500 క్యూసెక్కులు, ఉస్మాన్‌సాగర్‌(Osmansagar)కు 300 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: Breaking News: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..


..................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..................................................................

Hyderabad: 9వ అంతస్తు నుంచి దూకి...

- సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

city1.jpg

మియాపూర్‌(హైదరాబాద్): భర్తతో విభేదాలతో మానసికంగా ఒత్తిడికి గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee)ని అపార్ట్‌మెంట్‌ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్‌ పోలీసులు(Miyapur Police) తెలిపిన వివరాల ప్రకారం.. మయూరీనగర్‌లోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్‌లో భర్త నెహ్రూతో కలిసి సాయిసింధుర నివాసం ఉంటోంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. వీరికి వివాహమై 8 సంవత్సరాలైంది. ఈ మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీనికితోడు ఆమె అనారోగ్యానికి గురైంది. తీవ్ర మనస్తాపానికి గురైన దివ్యశక్తి తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌(Apartment) 9వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

ఇదికూడా చదవండి: మేము నిర్మిస్తే కాంగ్రెస్‌ కూల్చేస్తోంది: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 28 , 2024 | 09:46 AM