GHMC: జీహెచ్‌ఎంసీలో నగదు రహిత ఆస్తిపన్ను చెల్లింపులు..
ABN , Publish Date - Aug 13 , 2024 | 12:08 PM
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఆస్తిపన్ను నగదు చెల్లింపులకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పటి వరకు ఆస్తిపన్నులను నగదురూపంలోనే ఎక్కువ మంది చెల్లించేవారు. కొద్దిమంది మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్నులను చెల్లింస్తున్నారు.
- రెండునెలలుగా నగదు చెల్లింపులు తీసుకోని జీహెచ్‌ఎంసీ
- చెక్కు, గూగూల్‌పే, ఫోన్‌పే, డెబిడ్ కార్డుల ద్వారానే చెల్లింపులు
- నగదు చెల్లింపులు లేక వెనుతిరిగి పోతున్న మధ్యతరగతి, బస్తీ ప్రజలు
- పాత పద్దతినే కొనసాగించాలని కోరుతున్న పలువురు పన్నుచెల్లింపు దారులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లో ఆస్తిపన్ను నగదు చెల్లింపులకు ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. ఇప్పటి వరకు ఆస్తిపన్నులను నగదురూపంలోనే ఎక్కువ మంది చెల్లించేవారు. కొద్దిమంది మాత్రమే ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్నులను చెల్లింస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపులు కేవలం చెక్కులు, గూగూల్‌పే, ఫోన్‌పే, డెబిడ్ కార్డుల(Cheques, GooglePay, PhonePay, Debit Cards) ద్వారానే నిర్వహిస్తున్నారు. దీంతో ఇలాంటి సౌకర్యాలు లేని, తెలియని పేద మధ్య తరగతికి చెందిన పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలోనూ ఆస్తిపన్ను నగదు చెల్లింపులను నిలిపివేయడంతో ఆయా సర్కిళ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: స్టాక్ మార్కెట్‌లో లాభాలంటూ.. యువకుడిని నమ్మించి..
తిరిగి వెలుతున్న పన్ను చెల్లింపుదారులు
ఆస్తిపన్నులను చెల్లించేందుకు సర్కిల్ కార్యాలయానికి వస్తున్న పన్ను చెల్లింపుదారులు నగదు రహిత చెల్లింపులు మాత్రమే అని తెలియడంతో పలువురు పన్నులు చెల్లించకుండానే వెను తిరిగి పోతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పేద, మధ్య తరగతి ప్రజలు, బస్తీ ప్రాంతానికి చెందిన వారు ఈ నగదు రహిత చెల్లింపులను వ్యతిరేకిస్తున్నారు. అందరి వద్ద స్మార్ట్ ఫోన్‌లు ఉండకపోవచ్చని, ఇప్పటికీ చాలా మంది గూగూల్‌పే, ఫోన్‌పేలను వినియోగించని వారు ఉన్నారని, అదే విధంగా బ్యాంక్ చెక్కులు సైతం చాలా మందికి తెలియవని, ఇలాంటి పరిస్థితుల్లో నగదు మాత్రమే తీసుకుని కార్యాలయాలకు వస్తే నగదు చెల్లింపులు లేవని తెలియడంతో చెల్లింపుదారులు ఇబ్బంది పడాల్సివస్తుంది.
నోటరీ స్థలాలకు చెక్కులు మాత్రమే..
రిజిస్ట్రేషన్‌కు నోచకోక మల్కాజిగిరి సర్కిల్‌తో సహ అన్ని సర్కిళ్లలోనూ నోటరీ స్థలాలే ఎక్కువగా ఉన్నాయి. గతంలో నోటరీ స్థలాలకు సంబంధించి ప్రత్యేకంగా నగదు ద్వారా ఇంటిపన్నులు వసూళ్లు చేసేవారు. మారిన పద్దతి ప్రకారం నోటరీ ఇళ్లకు సంబంధించి కేవలం సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో మాత్రమే చెక్కులు తీసుకుంటున్నారు. వీటిని బిల్‌కలెక్టర్ల వద్ద నగదు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో పలువురు పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులకు గురికాకతప్పడం లేదు.
నగదు చెల్లింపులను పునరుద్ధరించాలి
ఇదిలా ఉండగా ఆస్తిపన్ను చెల్లింపులను పాత పద్దతిలోనే కొనసాగించేలా ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. పాత పద్దతిలోనే ఎక్కువ పన్నులు వసూళ్లు అయ్యేవని, నగదు రహిత చెల్లింపులతో ప్రభుత్వానికి లాభం కన్నా నష్టమే అవుతుందని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి గ్రేటర్‌లో నగదు చెల్లింపులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News