Share News

Golf Course: అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్కొండ గోల్ఫ్‌ కోర్సు

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:47 AM

గోల్కొండలోని గోల్ఫ్‌ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Golf Course: అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్కొండ గోల్ఫ్‌ కోర్సు

  • హైదరాబాద్‌లో వచ్చే ఏడాది ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌

  • మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గోల్కొండలోని గోల్ఫ్‌ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ గోల్ఫ్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆదివారం గోల్కొండలోని హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో జరిగిన ‘తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌ షిప్‌’ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి.. విజేతగా నిలిచిన శంకర్‌ దాస్‌కు ట్రోపీ, రూ.లక్ష నగదు బహుమతిని ప్రదానం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌ షిప్‌ను ఇంటర్నేషనల్‌ ప్రొఫెషనల్‌ టోర్నమెంట్‌గా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ఆసియా ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతి గోల్ఫ్‌ సీఈవో మనవి జైనీ, హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ అధ్యక్షుడు బీవీకే రాజు, డీఎ్‌సఆర్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ చైర్మన్‌ అజయ్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 03:47 AM