Goreti Venkanna: గోరటి వెంకన్నకు హైకోర్టులో ఊరట..
ABN , Publish Date - Aug 03 , 2024 | 05:35 AM
ఎమ్మెల్యే గోరటి వెంకన్నకు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో ప్రభుత్వ ఆస్తి అయిన ‘అమరజ్యోతి’ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించారని, డ్రోన్ కెమేరాలు వినియోగించారని పేర్కొం టూ జీహెచ్‌ఎంసీ సిబ్బంది,
అమరజ్యోతి వద్ద కేటీఆర్‌తో ఇంటర్వ్యూ కేసుపై స్టే
హైదరాబాద్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే గోరటి వెంకన్నకు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో ప్రభుత్వ ఆస్తి అయిన ‘అమరజ్యోతి’ వద్ద ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించారని, డ్రోన్ కెమేరాలు వినియోగించారని పేర్కొం టూ జీహెచ్‌ఎంసీ సిబ్బంది, కాంగ్రెస్ నేత జి.నిరంజన్ తదితరులు ఫిర్యాదు చేయడంతో సైఫాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కేటీఆర్, గోరటి వెంకన్నను నిందితులుగా చేర్చారు.
ఈ కేసును కొట్టేయాలని కోరుతూ గోరటి వెంకన్న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం.. కేసులో తదుపరి అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే విధించడంతోపాటు దిగువ కోర్టులో పిటిషనర్ హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా పడింది. ఇదే కేసులో కేటీఆర్‌కు సైతం ఇప్పటికే హైకోర్టులో ఊరట లభించింది.