CS Shanti kumari: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:27 AM
రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల(ఎ్‌సహెచ్‌జీ) మహిళలతో దాదాపు 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాల(ఎ్‌సహెచ్‌జీ) మహిళలతో దాదాపు 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పలు పథకాలపై సోమవారం ఆమె సచివాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అయిదు జిల్లాల్లో తొలివిడతలో భాగంగా వచ్చే ఆరు నెలల కాలంలో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏ ర్పాటు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న దేవాదాయ భూములను లీజుకు తీ సుకుని, వాటిలో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 150 ఎలక్ట్రిక్ బస్సులను సేకరించి, వాటి నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీకి అప్పగించాలని ఆమె పేర్కొన్నారు.