IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 09:28 PM
తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.
హైదరాబాద్: తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ(IPS transfer) జరిగింది. 28మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది. నిజానికి లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ బదిలీలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం, ఫలితాలు కూడా రావడంతో ప్రభుత్వం బదిలీ ప్రక్రియను చేపట్టింది.
1. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
2. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్
3. జోగులాంబ గద్వాల ఎస్పీగా టీ. శ్రీనివాసరావు
4. సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్
5. జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్
6. ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్
7. సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
8. కుమురంభీం అసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
9. మహబూబ్‌నగర్ ఎస్పీగా జానకి ధరావత్
10. బాలానగర్ డీసీపీగా కే.సురేశ్ కుమార్
11. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్
12. మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి
13. వికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
14. శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్
15. నల్గొండ ఎస్పీగా శరత్ చంద్రపవార్
16. రైల్వే ఎస్పీగా చందనా దీప్తి
17. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
18. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
19. డిచ్‌పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
20. మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్
21. జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి.మహేంద్ర నాయక్