GRT Jewels: వివాహ బంధానికి బంగారు బాట జీఆర్‌టీ జువెల్లర్స్
ABN , Publish Date - Sep 03 , 2024 | 05:06 AM
భారతీయ సంప్రదాయ వివాహానికి బంగారు బాట వేసే జువెల్లరీ తయారీ జీఆర్‌టీ సొంతమని ఆ కంపెనీ తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) :భారతీయ సంప్రదాయ వివాహానికి బంగారు బాట వేసే జువెల్లరీ తయారీ జీఆర్‌టీ సొంతమని ఆ కంపెనీ తెలిపింది. గత 60 సంవత్సరాలుగా నాణ్యతకు, విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తోందన్నారు. అద్భుతమైన ఆభరణాలు అందిస్తూ తరతరాలుగా భారతీయుల ఆదరణ పొందుతూ వస్తోందన్నారు. 1964లో మొదలైన జీఆర్‌టీ ప్రస్తానం అప్రతిహాతంగా కొనసాగుతోందనీ, నమ్మకానికి మారుపేరుగా ప్రసిద్ధమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుందని తెలిపారు.
‘‘వెడ్డింగ్ అండ్ సెలబ్రేషన్’’ నినాదంతో ప్రతి ముఖ్యమైన సందర్భాన్ని మర్చిపోలేని అనుభూతిగా మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు. బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, విలువైన రత్నాలతో ఆభరణాలు అత్యంత శ్రద్ధతో రూపొందిస్తామన్నారు. అద్భుతమైన వివాహ హారాలు, సొగసైన గాజులు, క్లిష్టమైన పూజా వస్తువులను ఆయా ప్రాంతాల సాంస్కృతిక ప్రాధాన్యత చాటే రీతిలో డిజైన్లు ఉంటాయన్నారు. భారతీయ వారసత్వాన్ని గుర్తిస్తూ చిరస్మరణీయమైన రీతిలో ఆభరణాలు రూపొందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు.