Share News

Harish Rao: తెలంగాణకు కేంద్రం మొండిచేయి: హరీశ్‌రావు

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:42 AM

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: తెలంగాణకు కేంద్రం మొండిచేయి: హరీశ్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100కోట్లు ఇచ్చి తెలంగాణకు మాత్రం గుండుసున్నా చుట్టారని ఆయన ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.


తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను రాబట్టడంలో బీజేపీ, కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమయ్యాయన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేది కాదన్నారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి సున్నా కేటాయింపులు చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు అడిషనల్‌ గ్రాంట్‌ కింద రూ.15,000 కోట్లు ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారని బాధలేదని, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే తమ ఆవేదన అని తెలిపారు.

Updated Date - Oct 12 , 2024 | 03:42 AM