Share News

BRS: ఎంఎస్ఎంఈల అభివృద్ధిని కాంగ్రెస్‌ తనఖాతాలో వేసుకుంటోంది: హరీశ్‌

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:23 AM

బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంఎ్‌సఎంఈల అభివృద్ధి, కేసీఆర్‌ సాధించిన విజయాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

BRS: ఎంఎస్ఎంఈల అభివృద్ధిని కాంగ్రెస్‌ తనఖాతాలో వేసుకుంటోంది: హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంఎ్‌సఎంఈల అభివృద్ధి, కేసీఆర్‌ సాధించిన విజయాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ఖాతాల్లో వేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎంఎ్‌సఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.


చాలా రాష్ట్రాల్లో ఎంఎ్‌సఎంఈలు మూతబడినా.. తెలంగాణలో అనుసరించిన ఐపాస్‌ విధానం ఈ రంగాన్ని దృఢంగా నిలిపిందని అన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 30శాతం ఉద్యోగావకాశాలు లభించాయని, ఎంఎ్‌సఎంఈ రంగంలో స్థిరమైనవృద్ధి నమోదుచేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని తమ ఘనతగా చెప్పుకొంటోందని విమర్శించారు.

Updated Date - Sep 19 , 2024 | 03:23 AM