Share News

Harish Rao: అదానీపై సభలో చర్చ ఎందుకు పెట్టట్లేదు?

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:23 AM

సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా గౌతమ్‌ అదానీపైన పోరాటం చేయాలనుంటే.. దావో్‌సలో ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Harish Rao: అదానీపై సభలో చర్చ ఎందుకు పెట్టట్లేదు?

  • పోరాటం నిజమైతే అగ్రిమెంట్లు రద్దు చెయ్యండి: హరీశ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా గౌతమ్‌ అదానీపైన పోరాటం చేయాలనుంటే.. దావో్‌సలో ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. రేవంత్‌ పోరాటం అదానీ మీదే అయితే ఈ అంశంపైన శాసనసభలో చర్చ పెట్టాలని కోరుతున్నా ఎందుకు పెట్టడంలేదంటూ నిలదీశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి.. రోడ్లపైన చేస్తున్న సర్కస్‌ ఫీట్లు చూసి.. ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందన్నారు.


రాజ్‌భవన్‌ వద్ద అదానీ అవినీతి గురించి మాట్లాడినట్లుగా సర్కస్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. అక్కడ కూడా కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ గురించే విమర్శలు చేశారన్నారు. అదానీ, రేవంత్‌ అక్రమ సంబంధం పైన అసెంబ్లీలో గురువారం చర్చ పెట్టాలని డిమాండ్‌ చేశారు. చట్టం అందరికీ సమానమైతే.. రాజ్‌భవన్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న అందరిపైనా కేసులు పెట్టాలని సీపీ సీవీ ఆనంద్‌కు సవాల్‌ విసిరారు. కాగా, మీడియాకు హరీశ్‌ రావు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. గురువారం, తాము ఏ రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ సభకు హాజరవుతామో చెబితే ఎలక్ట్రిక్‌ కారు గిఫ్టుగా ఇస్తామని మీడియాతో అన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 04:23 AM