Share News

Harish Rao : షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలి

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:23 AM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేసిన కాలయాపన వల్ల 8 నెలలుగా రైతు రుణాలపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు.

Harish Rao : షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలి

  • రైతుల సంఖ్య తగ్గించేందుకు సర్కారు కుట్ర:హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేసిన కాలయాపన వల్ల 8 నెలలుగా రైతు రుణాలపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు.

బ్యాంకులు పాస్‌పుస్తకాలు చూసి రైతులకు రుణాలిస్తే రేషన్‌ కార్డులు చూసి ప్రభుత్వం వాటిని మాఫీ చెయ్యడం ఏంటని ? మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ మార్గదర్శకాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటను రేవంత్‌ రెడ్డి తప్పుతున్నారని ఆరోపించారు.

మార్గదర్శకాలను చూస్తే అర్హుల సంఖ్యను తగ్గించడమే ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుందని అన్నారు. రేషన్‌ కార్డు షరతును తొలగించి.. రుణాలు తెచ్చుకున్న అందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పీఎం కిసాన్‌ సమాచారాన్ని రుణమాఫీకి పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 39లక్షల మంది రుణమాఫీకి దూరమవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ,రైతు పొందిన రుణాలపై 8 నెలల వడ్డీని కూడా ప్రభుత్వమే భరించి రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు అందరికీ రుణమాఫీ వర్తించేలా మార్పులు చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 17 , 2024 | 04:24 AM