Share News

Harish Rao: బీఏఎస్‌ పథకానికి నిధులివ్వండి..

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:15 AM

రాష్ట్రంలోని 25 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌(బీఏఎస్‌) పథకానికి నిధులను విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు

Harish Rao: బీఏఎస్‌ పథకానికి నిధులివ్వండి..

  • డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 25 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌(బీఏఎస్‌) పథకానికి నిధులను విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు శనివారం లేఖ రాశారు. ఈ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్లతో పాటు 2024-25కు అవసరమైన రూ.130 కోట్లను విడుదల చేయాలని కోరారు.


బీఏఎస్‌ పథకం కింద రాష్ట్రంలోని 150 ప్రైవేటు స్కూళ్లలో 18 వేల మంది ఎస్సీ, ఏడు వేల మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారని వివరించారు. వీరంతా అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాలు, జోగిని వ్యవస్థకు గురైనవారి పిల్లలని పేర్కొన్నారు. కాగా, విష జ్వరాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనతో వైద్యారోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. 45 రోజుల్లో రాష్ట్రంలో 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయని, గతేడాదితో పోలిస్తే ఇది 36శాతం అధికమని పేర్కొన్నారు.

Updated Date - Aug 25 , 2024 | 03:18 AM