Share News

Medak: హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:51 AM

తాను పని చేసే పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కొల్చారంలో జరిగింది.

Medak: హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

  • కొల్చారం పోలీ‌స్‌స్టేషన్ ఆవరణలోనే ఉరి

  • టిఫిన్‌ సెంటర్‌ యజమాని భర్త, అల్లుడి వేధింపులతోనే?

  • పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు

నర్సాపూర్‌/కొల్చారం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తాను పని చేసే పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కొల్చారంలో జరిగింది. నర్సాపూర్‌లో నివాసముండే సాయికుమార్‌(50) కొల్చారం పోలీ్‌సస్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న సాయికుమార్‌ పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్సై గౌస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపారు.


కుటుంబీకులకు సమాచారమందించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సాయికుమార్‌ భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్సాపూర్‌లోని ఓ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకురాలితో సాయికుమార్‌కు పరిచయం ఉందని దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకురాలి భర్త, అల్లుడు డబ్బు డిమాండ్‌ చేశారని తెలిపింది. దీంతో కొన్నిరోజులుగా తీవ్ర మానసిక క్షోభకు గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని శైలజ పేర్కొన్నది. కాగా, ఈ ఘటనపై మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ ఆరా తీశారు.

Updated Date - Dec 30 , 2024 | 04:51 AM