Share News

Damodar Rajanarsimha: కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భరోసా

ABN , Publish Date - Dec 14 , 2024 | 04:36 AM

కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం ఉద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగులు వచ్చినప్పటికీ కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను ఉద్యోగాల నుంచి తీసివేయబోమని ఆయన స్పష్టతనిచ్చారు.

Damodar Rajanarsimha: కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భరోసా

  • రెగ్యులర్‌ ఉద్యోగులు వచ్చినా తీసివేయం:దామోదర

  • మరో 323 పోస్టుల భర్తీకి మంత్రి హామీ

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం ఉద్యోగులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భరోసా ఇచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగులు వచ్చినప్పటికీ కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను ఉద్యోగాల నుంచి తీసివేయబోమని ఆయన స్పష్టతనిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో తనను కలిసిన ఏఎన్‌ఎంలతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు కోరగా.. ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌ అంశం కోర్టు పరిధిలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఏఎన్‌ఎం రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 29న జరిగే పరీక్షను యధావిధిగా నిర్వహిస్తామన్నారు.


కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు 30 మార్కులు వెయిటేజీగా ఇస్తున్నామని, పరీక్షకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్‌ఎంలు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌ ఇచ్చిన 1,931 పోస్టులకు అదనంగా 323 పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగం రానివారిని చివరివరకూ కాంట్రాక్ట్‌ ఉద్యోగంలో కొనసాగిస్తామని మంత్రి స్పష్టంచేశారు. కాగా మొత్తం పోస్టుల సంఖ్య 2,254కు చేరనుంది.

Updated Date - Dec 14 , 2024 | 04:36 AM