Share News

Rains: నగరంలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:28 PM

నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం (Rains) కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, హఫీస్ పెట్ పరిసర ప్రాంతాల్లో...

 Rains: నగరంలో భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం (Rains) కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, హఫీస్ పెట్, పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడని వర్షం కురిసింది. అలాగే ముషీరాబాద్‌, ఓయూ, తార్నాక‌, సరూర్‌న‌గ‌ర్‌, హయత్ నగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.


రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రంలో మరో వారం రోజులు పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్నిచోట్లు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 04:28 PM