Share News

Retirement: జస్టిస్‌ సాంబశివరావు నాయుడుకు వీడ్కోలు

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:03 AM

హైకోర్టు జడ్జి జస్టిస్‌ సాంబశివరావు నాయుడు పదవీ విరమణ నేపథ్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు.

Retirement: జస్టిస్‌ సాంబశివరావు నాయుడుకు వీడ్కోలు

హైకోర్టు జడ్జి జస్టిస్‌ సాంబశివరావు నాయుడు పదవీ విరమణ నేపథ్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాలులో నిర్వహించిన ఫుల్‌ బెంచ్‌ సమావేశంలో చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే మాట్లాడుతూ జస్టిస్‌ నాయుడు న్యాయ వ్యవస్థకు 33 ఏళ్లుగా సేవలందించారని కొనియాడారు.


మున్సిఫ్‌ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఆయన ప్రయాణం సాగిందన్నారు. హైకోర్టు జడ్జిగా రెండేళ్ల నాలుగు నెలల వ్యవధిలోనే 3,334 ప్రధాన కేసులు, 3,488 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ నాయుడు దంపతులను సన్మానించారు.

Updated Date - Aug 01 , 2024 | 04:03 AM