Share News

Justice Alok Arade: కేసుల విచారణలో అనవసర వాయిదాలు వద్దు

ABN , Publish Date - Nov 11 , 2024 | 03:54 AM

కోర్టుల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాదే కోరారు.

Justice Alok Arade: కేసుల విచారణలో అనవసర వాయిదాలు వద్దు

  • న్యాయవాదులకు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాదే సూచన

కరీంనగర్‌ లీగల్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని, వాటిని త్వరగా పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారం అందించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాదే కోరారు. కేసుల విచారణలో అనవసర వాయిదాలను అడగకూడదని సూచించారు. కరీంనగర్‌ జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం నూతనంగా నిర్మించనున్న భవనాల సముదాయానికి ఆయన శంకుస్థాపన చేశారు. సీతారాంపూర్‌ రోడ్డులో 20 జడ్జీల నివాస భవనాలకు ఇతర న్యాయమూర్తులతో కలిసి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో నూతనంగా వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. కుటుంబ, సివిల్‌ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్నా రు. హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ కె. లక్ష్మణ్‌, జస్టిస్‌ బి. వినోద్‌ కుమార్‌, జస్టిస్‌ విజయసేన్‌ రెడ్డి, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌, జస్టిస్‌ ఇ.వి. వేణుగోపాల్‌, జస్టిస్‌ పుల్లకార్తీక్‌, జస్టిస్‌ శ్రీనివాసరావు, జిల్లా జడ్జి బి. ప్రతిమ పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 03:54 AM