Share News

High Court: బస్సు చార్జీల్లేవు.. కేసు ఎక్కడున్నా ఒక్కటే!

ABN , Publish Date - Sep 20 , 2024 | 05:06 AM

విడాకుల కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

High Court: బస్సు చార్జీల్లేవు.. కేసు ఎక్కడున్నా ఒక్కటే!

  • విడాకుల కేసులో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): విడాకుల కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిర్మల్‌ కోర్టులో ఉన్న తన విడాకుల కేసును ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి కోర్టుకు బదిలీ చేయాలంటూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు.


ఇరుపక్షాల కక్షిదారులు నిర్మల్‌లోనే ఉంటుండటంతో పాటు పిటిషనర్‌ తొలుత నిర్మల్‌ అడ్ర్‌సనే ఇచ్చారని.. రాష్ట్రంలో మహిళలకు బస్సుచార్జీలు లేనందున.. పిటిషనర్‌కు ఏఇబ్బంది ఉండబోదని పేర్కొన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Sep 20 , 2024 | 05:06 AM