సీట్ల పెంపుపై ఇంజినీరింగ్ కాలేజీలకు ఊరట
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:24 AM
పెంచిన సీట్లకు మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు డివిజన్‌లో ఊరట లభించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పెంచిన సీట్లకు మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు డివిజన్‌లో ఊరట లభించింది. ఏఐసీటీఈ అనుమతిచ్చిన పెంపు మేరకు ఆయా కాలేజీల పూర్తిసామర్థ్యంతో ప్రవేశాలు (ఇంక్రీజ్డ్ ఇంటేక్ కెపాసిటీ) కల్పించేందుకు అవకాశం కల్పించాలని, అందుకు మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ప్రవేశాలు సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది.