Share News

Justice Sujoy Paul: సెక్స్‌ వర్కర్లపై వివక్ష చూపొద్దు..

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:49 AM

సెక్స్‌ వర్కర్ల పట్ల వివక్ష చూపరాదని, వారి కూడా సమాజంలోని ఇతర పౌరులతో సమానంగా హక్కులు ఉంటాయని హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి,

Justice Sujoy Paul: సెక్స్‌ వర్కర్లపై వివక్ష చూపొద్దు..

  • వారికీ హక్కులున్నాయ్‌: హైకోర్టు జడ్జి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సెక్స్‌ వర్కర్ల పట్ల వివక్ష చూపరాదని, వారి కూడా సమాజంలోని ఇతర పౌరులతో సమానంగా హక్కులు ఉంటాయని హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ అన్నారు. రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, సాథి(ఎన్జీవో) సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ ఎంసీఆర్‌హెచ్చార్డీలో శనివారం నిర్వహించిన సెక్స్‌ వర్కర్ల హక్కుల రాష్ట్రస్థాయి సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


సెక్స్‌ వర్కర్లకు పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. జాతీయ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ రూపొందించిన పథకాల ద్వారా అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అథారిటీ మెంబర్‌ సెక్రటరీ సీహెచ్‌ పంచాక్షరి వివరించారు.

Updated Date - Oct 27 , 2024 | 03:49 AM