Share News

Maoist: మావోయిస్టు మృతదేహాన్ని అప్పగించండి: హైకోర్టు

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:30 AM

ఏటూరునాగరం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు ఈగోలపు మల్లయ్య మృతదేహాన్ని ఆయన భార్య అయిలమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Maoist: మావోయిస్టు మృతదేహాన్ని అప్పగించండి: హైకోర్టు

హైదరాబాద్‌/ములుగు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఏటూరునాగరం ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు ఈగోలపు మల్లయ్య మృతదేహాన్ని ఆయన భార్య అయిలమ్మ, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌కు గురైన ఏడుగురి మృతదేహాల్లో ఆరు మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబాలకు పోలీసులు అప్పగించారు. అయితే.. తన భర్త మృతదేహంపై గాయాలున్నాయని.. ఇది కస్టోడియల్‌ మరణమంటూ పిటిషనర్‌ అయిలమ్మ పేర్కొనడంతో మల్లయ్య మృతదేహాన్ని భద్రపర్చాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది.


తాజాగా గురువారం ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. పోస్ట్‌మార్టం నివేదిక, వీడియోలు, ఇతర వివరాలను దర్యాప్తు అధికారికి అందజేయాలని పేర్కొంటూ.. విచారణను 26కు వాయుదా వేసింది.

Updated Date - Dec 06 , 2024 | 03:30 AM