Share News

CS Shanti kumari: పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి...

ABN , Publish Date - Mar 21 , 2024 | 04:36 PM

Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఈరోజు(గురువారం) సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే.. అదే స్పూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు.

CS Shanti kumari: పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి...

హైదరాబాద్‌, మార్చి 21: లోక్‌సభ ఎన్నికల (Loksabha Elections) నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (State Government Chief Secretary Shanti Kumari) పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఈరోజు(గురువారం) సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) పనిచేసిన విధంగానే.. అదే స్పూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు. రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు.. ఆయా రాష్ట్రాల చెక్ పోస్టులతో కలసి సమన్వయంతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు.

Freebies: పార్టీల ఉచిత హామీలపై.. సుప్రీం కోర్టులో సుదీర్ఘ విచారణ


చెక్‌పోస్టుల ఏర్పాటు..

రాష్ట్రంలో ఇప్పటికీ వివిధ శాఖల ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో పోలీస్‌శాఖ ద్వారా 444 చెక్ పోస్టులుండగా, 9 అంతర్రాష్ట్ర చెక్-పోస్ట్‌లున్నాయన్నారు. ఇప్పటి వరకు పోలీస్‌శాఖ ద్వారా పదికోట్ల రూపాయలను సీజ్ చేశామని.. అలాగే లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. రవాణా శాఖ ద్వారా 15 చెక్ పోస్టులు, 52 ఎన్ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ చెక్‌పోస్టులు 24 గంటలు పనిచేస్తాయన్నారు. రవాణా శాఖ బృందాలు జరిపిన తనిఖీలలో రూ. 34 .31 లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాణిజ్య పన్నులశాఖ ద్వారా 16 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు 31 స్ట్రాటెజిక్ పాయింట్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

YS Sharmila: జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?


రూ.50 లక్షల విలువైన మద్యం పట్టివేత..

వీటితో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువులను పంచేందుకు అవకాశమున్న 25 గోదాములను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు. 141 గోదాములు, 912 వివిధ వస్తువుల తయారీ గోదాములపై కూడా నిఘా పెట్టామన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా 21 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఆరు మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న ఎనిమిది జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించామని సీఎస్ తెలిపారు. మద్యం అక్రమ రవాణాకు అవకాశమున్న ఐదు రైలు మార్గాలను గుర్తించి వాటి నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు రూ.50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీలపై ప్రత్యేక నిఘా ఉంచామని, సి.సి టీవీలను ఏర్పాటు చేసి డిస్టిలరీస్ ద్వారా మద్యం సరఫరాను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని పోలీస్ శాఖకు చెందిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కూడా మద్యం రవాణాపై సి.సి టీవీల ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించినట్టు తెలిపారు. అటవీ శాఖ ద్వారా కూడా 65 చెక్ పోస్టులు ఏర్పాటు కాగా దీనిలో 18 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవిన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి...

BRS: ఆ ఐదు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జనభర్జన

Big Breaking: సంచలన నిర్ణయం తీసుకున్న ఎంఎస్ ధోనీ.. సీఎస్‌కే కెప్టెన్‌గా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 04:44 PM