Home » Shanti Kumari New CS
ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే సందర్శకుల కోసం ‘స్కైవాక్’ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi kumari) అధికారులకు సూచించారు.
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్‌జామ్, వరదనీటి నిల్వలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Chief Secretary Shantikumari) అధికారులను ఆదేశించారు.
జూలై నెలాఖరులోగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను పూర్తిగా ప్లాస్టిక్‌రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
Telangana: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.
Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఈరోజు(గురువారం) సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన విధంగానే.. అదే స్పూర్తితో రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పని చేయాలని కోరారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కేసీఆర్ సర్కార్‌కు, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆగ్రహం..