Drugs: ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్.. ఎక్కడంటే
ABN , Publish Date - Oct 25 , 2024 | 10:52 AM
Telangana: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. భారీగా డ్రగ్స్ పట్టుబడటంతో పాటు ఇంటర్నేషనల్, అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ పట్టుబడిన డ్రగ్స్ విలువ ఎంతంటే...
హైదరాబాద్, అక్టోబర్ 25: డ్రగ్స్‌ను నియంత్రించేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలను కూడా డ్రగ్ ఫెడ్లర్‌లు పట్టించుకోని పరిస్థితి. షరా మామూలే అన్న చందంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులకు చిక్కడం.. ఆపై బయటకు వచ్చిన తరువాత కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ డ్రగ్స్ సరఫరా చేయడం అనేది వారికి పరిపాటిగా మారింది. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. అనేక సార్లు యువకులు, స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఎన్నో. విలాసవంతమైన జీవితం గడపాలని, అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో యువత ఈ దారిని ఎంచుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే తాజాగా మరోసారి భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.
Telangana: పక్కా ఆధారాలు.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి
లోకల్ పోలీసులతో కలిసి హెచ్ న్యూ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్‌నగర్, హెచ్ న్యూ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. విదేశీ డ్రగ్ పెడ్లర్ నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంచన్‌బాగ్ పోలీసులకు మరో అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్ చిక్కాడు. అతని వద్ద నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 25 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్, అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను హాజరుపర్చనున్నారు.
Investment Tips: ఈ పోస్టాఫీస్ స్కీంలో రూ. 10 లక్షలు పెడితే.. వచ్చేది రూ. 21 లక్షలు..
కాగా.. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డ్రగ్స్‌తో పాటు గంజాయి, హషీష్ ఆయిల్ డ్రగ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బోయిన్‌పల్లిలో ఆంఫేటమైన్ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను నేరుగా పీల్చుకోవడం లేదా కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్‌ను అమ్మాయిలపై అత్యాచారం చేసేందుకు వాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే హయత్‌నగర్‌లో భారీగా హషిష్ ఆయిల్ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
AP Politics: షర్మిలపై జగన్‌కు ఎందుకంత ‘పగ’.. అంటే..
David Warner: ‘సాండ్‌పేపర్’ స్కాం: వార్నర్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత
Read Latest Telangana News And Telugu News