Hyderabad: కిలోమీటర్ ప్రయాణానికి 45 నిమిషాలు...
ABN , Publish Date - May 26 , 2024 | 10:03 AM
ఒక్క అడుగు ముందుకు కదలాంటే ఐదు నిమిషాలు.. కిలోమీటర్ ప్రయాణానికి ఏకంగా 45 నిమిషాల సమయం. ఇదీ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు45(Jubilee Hills Road No.45)లోని వాహన చోదకుల పరిస్థితి.
- జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో పరిస్థితి
- ప్రత్యక్ష నరకం చూసిన వాహన చోదకులు
హైదరాబాద్: ఒక్క అడుగు ముందుకు కదలాలంటే ఐదు నిమిషాలు.. కిలోమీటర్ ప్రయాణానికి ఏకంగా 45 నిమిషాల సమయం. ఇదీ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు45(Jubilee Hills Road No.45)లోని వాహన చోదకుల పరిస్థితి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొత్త సంస్కరణల పేరిట పోలీసులు కాలాయాపన చేస్తున్నారు తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నదానికి శనివారం ఇక్కడ వాహన చోదకులు అనుభవించిన ప్రత్యక్ష నరకమే ఉదాహరణ. శనివారం రోడ్డు నంబరు 45లో ఓ మంచినీటి ట్యాంకర్‌కు సమస్య తలెత్తి రోడ్డు మీదే నిలిచిపోయింది. దీంతో వెనుకాల వస్తున్న వాహనాలు నెమ్మదించాయి. అరగంట తరువాత స్పందించిన పోలీసులు ప్రత్యామ్నాయదారుల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు.
ఇదికూడా చదవండి: Actress Hema: రేవ్‌పార్టీ వివాదంలో నటి హేమకు నోటీసులు
కానీ, అప్పటికే అలస్యం అయిపోయింది. ట్రాఫిక్ జాం నెలకొనడంతో సుమారు రెండు గంటల పాటు వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. దీనికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇదే సమయంలో కమాండ్ కంట్రోల్ సందర్శనకు వెళ్లారు. సీఎం రాకపోకలతో మరో అరగంటపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో వాహన చోదకులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. రోడ్డు నంబరు 45 నుంచి కిలో మీటరు దూరంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రోడ్డుకు రావడానికి 45 నిమిషాలకు పైనే పట్టిందని వాహనచోదకులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu Newshy