Hyderabad: స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Sep 26 , 2024 | 11:04 AM
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు.
- ‘సమగ్ర కులగణన - సామాజిక న్యాయం’ సదస్సులో వక్తల డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వచ్చేది బీసీల యుగం, బీసీల రాజ్యమని, కులం అడ్డుగోడలను ఛేదించడానికి మహా ఉద్యమం రావాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)లో ‘సమగ్ర కులగణన - సామాజిక న్యాయం’పై రాష్ట్ర స్థాయి అఖిల పక్ష సదస్సు జరిగింది. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ఫౌండేషన్ సెక్రెటరీ జనరల్ రాపోల్ జ్ఞానేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎ్‌స రాములు తదితరులు మాట్లాడారు.
ఇదికూడా చదవండి: Tirumala Laddu: తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. అన్ని ఆలయాల్లో
బీసీలపై కనిపించని వివక్ష, దోపిడీ కొనసాగుతున్నదని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడానికి, సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని అన్నారు. బీసీ రాజ్యాధికారం సాధించడానికి మహా ఉద్యమం రావాలన్నారు. మన కలలు సాకారం అయినప్పుడే కొండా లక్ష్మణ్ బాపూజీకి నిజమైన నివాళి అని కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ డిమాండ్ చేశారు.
గుజ్జ సత్యం మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో యుద్థమే జరుగుతుందని హెచ్చరించారు. సమగ్ర కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. సదస్సులో సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, లాల్ కృష్ణ, సురేష్, కిరణ్, శ్రీకాంత్ గౌడ్,మునుగోడు మాజీ జెడ్పీటీసీ బొల్లి శివకుమార్, వేముల రామకృష్ణ, వివిధ బిసి కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
...................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
Hyderabad: జల్సాల కోసం చోరీలు చేస్తూ చివరకు ఏమయ్యారో తెలిస్తే..
- లలితా జ్యువెలరీ మార్ట్ లో చెవి రింగులు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: జల్సాల కోసం నగల దుకాణంలో బంగారు ఆభరణాలు దొంగలిస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పంజాగుట్ట(Panjagutta) పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 6వ తేదీన ఒక మహిళ, ఒక వ్యక్తి పంజాగుట్టలోని లలితా జ్యువెలరీ మార్ట్(Lalitha Jewelery Mart)కు వచ్చారు. మొదటి అంతస్తులోని చెవిపోగుల విభాగంలోకి వెళ్లి చెవిపోగులు చూస్తున్నట్టు నటించారు. సిబ్బంది దృష్టి మళ్లించి 12.2 గ్రాముల బరువు ఉన్న రెండు బంగారు చెవి రింగులను బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని సిబ్బంది గమనించలేదు.
7వ తేదీ ఉదయం సిబ్బంది వివిధ అంతస్తుల్లో ఉన్న బంగారు ఆభరణాల లెక్కను సరి చూడగా, చెవి పోగుల విభాగంలో ఒక జత చెవి రింగులు కనిపించలేదు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా 6వ తేదీన వచ్చిన మహిళ, వ్యక్తి వాటిని దొంగలించినట్టు గుర్తించారు. షోరూమ్ మేనేజర్ మొగిలి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్ వినాయక్ నగర్ కు చెందిన ఎలక్ర్టీషియన్ కౌడ నర్సింగ్ రావు(40), పాత సఫిల్‌గూడకు చెందిన టైలర్ కారుపర్తి అరుణ(34)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12.2 గ్రాముల బంగారు చెవి రింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరిద్దరూ దొంగతనాలు చేస్తున్నారని, గతంలో కూడా కూకట్‌పల్లి పోలీసులు వీరిని అరెస్టు చేశారని డీఐ శ్రావణ్ కుమార్‌తెలిపారు.
ఇదికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..
ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా
ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..
Read Latest Telangana News and National News