Share News

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:56 PM

నగరంలోని పలు ప్రాంతాలకు శుక్రవారం ఉదయం ఆరు నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు అధికారులు(Water Board Officers) ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌సిటీ: నగరంలోని పలు ప్రాంతాలకు శుక్రవారం ఉదయం ఆరు నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు అధికారులు(Water Board Officers) ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని లింగంప ల్లి, పటాన్‌చెరు(Lingampa Lli, Patancheru), ఈఎస్ఐ కమాన్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్‌కు జంక్షన్‌ పనులు చేపడుతున్నారు. ఈ పనులు శుక్రవారం ఉదయం ఆరు నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు జరగనున్నాయి.

ఇదికూడా చదవండి: Hyderabad: ఔరంగాబాద్‌లో ఓటమితో లోక్‌సభలో మజ్లిస్‏కు మళ్లీ ఒకే ఒక్కడు..!


దీంతో అపరేషన్‌ మెయింటనెన్స్‌ 8, 9డివిజన్లలో నీటి సరఫరాలో అంతరాయం కలుగనుందని, పటాన్‌చెరు, ఆర్సీ పురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ(Chandanagar, Gangaram, Medinaguda), హఫీజ్‌ పేట్‌, డోయెన్స్‌కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్‌ సెంటర్‌, బీహెచ్‌ఈఎల్‌ ఫ్యాక్టరీ, టౌన్‌షిప్‌, హెచ్‌సీయూ, పటాన్‌చెరు(Patancheru) పారిశ్రామిక ప్రాంతవాసులకు అంతరాయం తలెత్తుందని అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 12:56 PM