Share News

Hyderabad: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:39 AM

ఐటీ కారిడార్‌లో బాలీవుడ్‌ హీరో సోనుసూద్‌(Bollywood hero Sonusood) సందడి చేశారు. మీది మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎగస్ర్టా అనే డైలాగ్‌తో సోషల్‌ మీడియాలో స్టార్‌గా మారిన కుమారీ ఆంటీ ఫుడ్‌ కోర్టును శుక్రవారం సోనుసూద్‌ అనుకోకుండా సందర్శించారు.

Hyderabad: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..

హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో బాలీవుడ్‌ హీరో సోనుసూద్‌(Bollywood hero Sonusood) సందడి చేశారు. మీది మొత్తం వెయ్యి రూపాయలు.. రెండు లివర్లు ఎగస్ర్టా అనే డైలాగ్‌తో సోషల్‌ మీడియాలో స్టార్‌గా మారిన కుమారీ ఆంటీ ఫుడ్‌ కోర్టును శుక్రవారం సోనుసూద్‌ అనుకోకుండా సందర్శించారు. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మధ్యాహ్నం 12 గంటల సమయంలో గచ్చిబౌలి మార్గం వైపున వెళ్తూ ఫుడ్‌కోర్టు వద్దకు వచ్చాడు. ఆయన వచ్చే 10 నిమిషాల ముందు కుమారీ ఆంటీ కుటుంబసభ్యులకు వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో కుమారీ ఆంటీ బంధువుల ఇంటికి ఆటోలో వెళ్తుండగా.. ఆమె పిల్లలు ఫోన్‌లో సమాచారమివ్వడంతో వేగంగా ఫుడ్‌కోర్టు(Food court) వద్దకు వచ్చింది. 12 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన సోనూసూద్‌ను చూసి కుమారీ ఆంటీ, ఆమె పిల్లలు తెగసంతోషపడ్డారు. వచ్చిరాగానే.. ‘హలో.. హవ్‌ ఆర్‌ యూ కుమారీ ఆంటీ.. కైసాయే ఆప్‌.. సో నైస్‌ టూ సీ యూ’ అంటూ ఆప్యాయంగా పలకరించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రేపు జగన్నాథ స్వామి రథయాత్ర..


city4.2.jpg

నౌవ్‌ అయామ్‌ విత్‌ కుమారి ఆంటీ అని చెప్పడంతో అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ కుమారీ ఆంటీ ఈజ్‌ సెల్ప్‌ మేడ్‌ లేడీ అని, ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ను చూపిస్తోందని కొనియాడారు. దేశంలోని ప్రతి మహిళ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని, కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ ఇస్‌ బెస్ట్‌ ఎంగ్జాపుల్‌ అన్నారు. అనంతరం ఈ రోజు ఫుడ్‌కోర్టులో ఏమి ఉన్నాయని.. అడిగితే.. వెజ్‌, నాన్‌వెజ్‌ ఉందని కుమారీ ఆంటీ చెప్పింది. వెజ్‌ రూ.80, నాన్‌ వెజ్‌ రూ.120 ఉందని అంటే.. నేను రూ. 80 రూపాయల కస్టమర్‌ (వెజ్‌ కస్టమర్‌)ను అని నవ్వుతూ చెప్పారు. నాకు ఎంత డిస్కౌంట్‌ ఇస్తావంటే.. ఫ్రీ ఇస్తానని చెప్పింది. నాకు కష్టమొచ్చినప్పుడు ఫోన్‌ చేసి అండగా నిలబడ్డారు. మీరు మా దగ్గరి రావడం చాలా సంతోషంగా ఉంది.. థ్యాంక్యూ అని కుమారీ ఆంటీ అనగా.. గ్లాడ్‌ బ్లెస్‌ యూ అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 10:39 AM