Hyderabad: బస్సు టికెట్ ధర నాలుగింతలు పెంచేశారు... రూ. 720 టికెట్ 3000కు..
ABN , Publish Date - Apr 27 , 2024 | 10:51 AM
సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు తమ ఊరికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, బస్సులు(Trains and buses) ఇప్పటికే ఫుల్ అయ్యాయి.
- ఓటేయడానికి ఆంధ్రాకు వెళ్లాలంటే కష్టమే
- బస్సులు.. రైళ్లు హౌస్‌ఫుల్
హైదరాబాద్ సిటీ: సొంత ఊరిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకున్న వారు తమ ఊరికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, బస్సులు(Trains and buses) ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తగిన ఏర్పాట్లు చేస్తే తప్ప.. ఊరెళ్లే మార్గం లేదని పలువురు పేర్కొంటున్నారు.
రైళ్లలో లేదు చోటు
స్కూళ్లకు వేసవి సెలవులు రావడంతో ఇప్పటికే రైళ్లన్నీ చాంతాడంత వెయింటింగ్ లిస్ట్‌తో ఉన్నాయి. మే 9 నుంచి 14 వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే ప్రకటించినా, ఈ సర్వీసులు ఎంత వరకూ సరిపోతాయని సగటు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్నంకు స్పెషల్ ట్రైన్ కూడా వేయలేదని ఐటీ ఉద్యోగి సాయి పేర్కొంటున్నారు.
ఇదికూడా చదవండి: BJP: కాంగ్రెస్‌ను దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరు: బండి సంజయ్
రైళ్ల సంగతి ఇలాగుంటే ప్రైవేట్ బస్‌ల ఆపరేటర్లు అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ధరలు పెంచేశారు. సాధారణ చార్జీలతో పోలిస్తే మూడు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్‌కు సాధారణ రోజుల్లో బేస్ చార్జీ 720 రూపాయలు ఉంటే, మే 12న 3వేల రూపాయలుగా ఉంది. ఇదే విషయమై ఓ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోలర్‌గా పనిచేస్తోన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఓటు విలువైనది అంటే ఏమిటో అనుకున్నాం కానీ, ఇంత ఖరీదుగా మారుతుందని అనుకోలేదని వాపోయారు. ఇద్దరి ఓట్ల కోసం రూ.10వేలకు పైగా ఖర్చుచేయాలంటే కష్టమే అని పేర్కొన్నారు. కుర్రకారు మాత్రం చలో ట్యాక్సీ అంటున్నారు. నలుగురైదుగురు కలిసి ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లి ఓటేయనున్నామని, అందులో సందేహాలకు తావే లేదని చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: BRS: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేడు.. వేడుకలు సాదాసీదాగా జరపాలని నిర్ణయం
Read Latest National News and Telugu News