Hyderabad: చలో దుబాయ్.. జనవరి 12 వరకు షాపింగ్ ఫెస్టివల్
ABN , Publish Date - Dec 10 , 2024 | 11:54 AM
డిసెంబరు నెలలో దుబాయ్‌లో భారీ షాపింగ్ ఫెస్టివల్(Shopping Festival) కొనసాగుతుంది. ఆ ఫెస్టివల్‌కు నగరం నుంచి వెళ్తున్నవారు ఏటేటా పెరుగుతున్నారు. ఈనెల 6 నుంచి జనవరి 12 వరకు జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వెళ్తుంటారు.
- అధిక సంఖ్యలో వెళ్తున్న నగర వాసులు
హైదరాబాద్: డిసెంబరు నెలలో దుబాయ్‌లో భారీ షాపింగ్ ఫెస్టివల్(Shopping Festival) కొనసాగుతుంది. ఆ ఫెస్టివల్‌కు నగరం నుంచి వెళ్తున్నవారు ఏటేటా పెరుగుతున్నారు. ఈనెల 6 నుంచి జనవరి 12 వరకు జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వెళ్తుంటారు. 2005 నుంచి నగరవాసులు దుబాయ్ ఫెస్టివల్‌కు వెళ్తున్నారు. ఒకప్పుడు దుబాయ్‌కి ఉపాధికోసం వెళ్తుండేవారు. ప్రస్తుతం షాపింగ్ ఫెస్టివల్‌కు దేశవ్యాప్తంగా వెళ్తున్న వారిలో నగరవాసుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఏపీకే ఫైల్ రూపంలో క్యూఆర్ కోడ్ మోసాలు..
షాపింగ్‌లో ఏమున్నాయంటే..
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు వెళ్తుంటారు. వీరిలో యూరోపియన్‌ల సంఖ్య అధికం. ఇందులో చిన్న చిన్న ఎలక్ర్టానిక్ వస్తువుల దగ్గరి నుంచి బంగారం, దుస్తులు, లెదర్ గూడ్స్, పెర్‌ఫ్యూమ్స్, మద్యం ఇలా ఒక్కటేమిటి అనేకం లభిస్తాయి. అత్యంత నాణ్యమైన బంగారానికి దుబాయ్ పెట్టింది పేరు. దుబాయ్ ప్రపంచ బంగారానికి హబ్ లాంటింది. ఇటీవల తనిఖీలు ముమ్మరం చేయడంతో మనవాళ్లు బంగారం కంటే దుస్తులు, లెదర్ గూడ్స్, గడియారాలు వంటివే అఽధికంగా కొనుగోలు చేస్తున్నారు.
ఎక్కడ చూసినా..
షాపింగ్ ఫెస్టివల్‌కు వెళ్తున్నవారిలో 56 శాతం మంది ఇండియన్స్, ఎన్‌ఆర్‌ఐలు ఉంటారని ట్రావెల్స్ ఏజెంట్‌ల చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వారు ఈ ఫెస్టివల్‌కు వెళ్లడం ఇటీవల కాలంలో పెరిగిందని పేర్కొంటున్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతుండడంతో దుబాయ్‌లో చాలా పెట్టుబడులు మన వాళ్లవే. ఫ్లాట్స్‌కొని నివసిస్తున్న వారిలో సగం శాతం మంది ఇండియన్సే ఉన్నారు. దుబాయ్‌లో సెటిల్ అయిన మనవారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి వెళ్లవచ్చు. కానీ అక్కడి ప్రభుత్వ బెనిఫిట్స్ ఉండవు. దుబాయ్‌లో ఇండియన్ రెస్టారెంట్లు వీధికి ఒకటి ఉన్నాయి. ఏ హోటల్‌లో అయినా హైదరాబాద్ బిర్యానీ లభిస్తుంది.
షాపింగ్‌తోపాటు ఇవి కూడా..
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు వెళితే షాపింగ్ చేసుకోవడంతో పాటు డిసెర్ట్ సఫారీ, బెల్లీ డ్యాన్స్, బార్బిక్యూ రెస్టారెంట్ డిన్నర్‌లు, డ్యూన్ డాషింగ్, అత్యంత ఎత్తైన టవర్ అయిన బుర్జ్ ఖలీఫాలో 124 అంతస్తు నుంచి దుబాయ్ సందర్శన, అక్కడే డిన్నర్, గ్లోబల్ విలేజ్ సందర్శన.
టూర్ ప్యాకేజీలు
నగరం నుంచి దుబాయ్ వెళ్లడానికి చాలామంది ట్రావెల్స్‌వారు ప్యాకేజీలు అందిస్తున్నారు. దుబాయ్‌కు ప్రతిరోజూ పది విమానాలు వెళ్తుంటాయి. నాలుగు రాత్రులు, ఐదు పగలు ఒక ప్యాకేజీ, ఆరు రోజులు, ఐదు రాత్రులు మరో ప్యాకేజీ. ఒకరికి రూ. 48 వేల నుంచి 62 వేల వరకు తీసుకుంటున్నారు. ఇందులో రానుపోను విమాన టికెట్‌లతోపాటు త్రీస్టార్ హోటల్స్ సౌకర్యం, బ్రేక్‌ఫా్‌స్ట/డిన్నర్ ఉచితం. మన ధరలో మూడు వేల రూపాయలకు మంచి హోటల్స్‌లో వసతి లభిస్తుంది.
అక్కడి నిబంధనలు తెలుసుకోవాలి
మేము చాలాసార్లు దుబాయ్ వెళ్లాం. అక్కడి నిబంధనలు తెలుసుకోవాలి. స్వేచ్ఛగా ఉండొచ్చు. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. రోడ్డు దాటేవారికి దుబాయ్‌లో ప్రాధాన్యం ఇస్తారు. డిసెర్ట్ సఫా రీ, గ్లోబల్ విలేజ్ చూడదగ్గవి. అక్కడ మన రెస్టారెంట్లు అధికం. ఇడ్లీ నుంచి బిర్యానీ, కబాబ్ వంటివి లభిస్తాయి. ఎక్కడ చూసినా మనవారే కనిపిస్తుంటారు. గ్రూపులుగా వెళితే షాపింగ్ ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
- జి.వెంకటేష్ యాదవ్, నార్సింగ్
ప్రతి షాపింగ్‌కు లక్కీ డ్రా కూపన్
దుబాయ్ షాపింగ్‌లో చాలా వస్తువులపై డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి షాపింగ్‌కు లక్కీ డ్రా కూపన్ ఇస్తారు. ఎన్ని షాపింగ్‌లు చేస్తే అన్ని కూపన్లు ఇస్తారు. లక్కీ డ్రా అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. షాపింగ్ ఫెస్టివల్ ముగిసిన తర్వాత డ్రా తీస్తారు. చాలా విభాగాలలో బహుమతులు అందజేస్తారు. కూపన్‌లో అడ్రస్ రాస్తే ఆ చిరునామాకు బహుమతి పంపిస్తారు. లక్కీ డ్రాలో నగదు బహుమతులతో పాటు పది కిలోల బంగారం కూడా ఉంటుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు నగరం నుంచి వేలమంది వెళ్తుంటారు. తాము ఇటీవల వెళ్లి వచ్చాము.
- ఎం. సూర్యప్రకాష్, మగధ టౌన్‌షిప్
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం
ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
Read Latest Telangana News and National News