Share News

Hyderabad: త్వరలో ‘చలో కొడంగల్‌’..

ABN , Publish Date - Nov 15 , 2024 | 07:53 AM

కొడంగల్‌(Kodangal) ఫార్మా కోసం గిరిజనుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వెంటనే విరమించాలని గిరిజన సంఘాల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త నపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా లంబాడీ రైతులపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిందని ఆరోపించారు.

Hyderabad: త్వరలో ‘చలో కొడంగల్‌’..

- అక్కడి గిరిజనులను విడుదల చేయాలి

- గిరిజన సంఘాల జేఏసీ నేతల హెచ్చరిక

హైదరాబాద్: కొడంగల్‌(Kodangal) ఫార్మా కోసం గిరిజనుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వెంటనే విరమించాలని గిరిజన సంఘాల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త నపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా లంబాడీ రైతులపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిందని ఆరోపించారు. గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని అందరిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బాటిల్‌ నీళ్లా.. జరదేఖో..


గురువారం బాగ్‌లింగంపల్లి(Baglingampalli)లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ‘కొడంగల్‌ ఫార్మా- భూముల కేటాయింపు’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్‌నాయక్‌(Bhukya Sanjeev Nayak), ప్రొఫెసర్‌ నారాయణ, గణేష్ నాయక్‌, మోతీలాల్‌, శంకర్‌నాయక్‌తో పాటు పలువురు మాట్లాడారు.


city3.2.jpg

ఫార్మాసిటీ కోసం గిరిజనుల వ్యవసాయ భూములను తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. వచ్చే సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి గిరిజనుల చలో కొడంగల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకించారు. సమావేశంలో గిరిజన జేఏసీ నాయకులు రాంబాబు నాయక్‌, రాజునాయక్‌, హరినాయక్‌, రాథోడ్‌, విద్యాకృష్ణ, శ్రీనివా్‌సనాయక్‌, కల్యాన్‌నాయక్‌, మోహన్‌, బిక్షనాయక్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 07:53 AM